చేనేత అభివృద్ధికి నిధిని ఏర్పాటు చేస్తాను అన్న మంత్రి ప్రసాద్‌కుమార్‌

కొస్గి: చేనేత అభివృద్ధికి స్త్రీనిధి మాదిరిగా చేనేత నిధిని ఏర్పాటు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కొస్గి క్లస్టర్‌లో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం వారం రోజుల్లో సర్వే నిమిత్తం రూ.10 కోట్టను విడుదల
చేయనున్నట్లు ఆయన తెలిపారు. వ్యాట్‌ ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న వస్త్ర వ్యాపారులతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని, వచ్చే అసెంబ్లీ సెషన్‌లో దీని గురించి ప్రకటన చేయనున్నారన్నారు. ఈ మేరకు బొత్స టీజీ వెంకటేశ్‌తో కలిసి ముఖ్యమంత్రితో ఈ విషయమై  చర్చించామన్నారు.

తాజావార్తలు