ఛార్జీల పెంపుపై అబాద్ధాలు : రాఘవులు

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల్‌ పెంపునకు నిరసనగా వామపక్షాల నేతలు కలెక్టరేట్‌ ఎదుట సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నారాయణతో కలిసి రాఘవులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేతలు బలవంతంగానైనా సీఎంను ఒప్పించి విద్యుత్‌ ఛార్జీలు తగ్గేలా చూడాలని రాఘవులు కోరారు.