జంట నగరాల్లో అర్టీసీ గమ్యస్థానాల్లో మార్పులు

హైదరాబాద్‌ : గణేష్‌ నిమజ్జనం సందర్బంగా జంట నగరాలకు వచ్చే బస్సుల గమ్యస్ధానాల్లో మార్పులు చేపట్టినట్లు అర్టీసీ వెల్లడించింది. కరీంనగర్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఉదయం 10 నుంచి జేబీఎస్‌ వరకే పరిమితం చేయనున్నారు.కర్నూలు వైపు నుంచి వచ్చే బస్సులు అరాంఘడ్‌ చౌరస్తా, చాదర్‌ఘాట్‌ మీదుగా ఎంజీబీఎన్‌ వరకు, మద్యాహ్నం12 గంటల తర్వాత జూపార్క్‌ వరకు పరిమితం కానున్నాయి. విజయవాడ నుంచి వచ్చేబస్సులు మద్యాహ్నం 12 తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌ వరకు మాత్రమే అనుమతిస్తారు. వరంగల్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఉదమం 10 గంటల తర్వాత ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద నిలిపివేయనున్నారు.