జంతర్‌మంతర్ వద్ద భాజపా ఆందోళన
ఢిల్లీ : భాజపా, ఆర్ఎస్ఎస్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి షిండే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భాజపా నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. షిండే వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జంతర్‌మంతర్ వద్ద భాజపా ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. షిండే వ్యాఖ్యలపై సోనియా, ప్రధాని మన్మోహన్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ వ్యక్తం చేశారు.