జగన్‌ యాక్షన్‌ ప్లాన్‌

హైదరాబాద్‌ : నవంబర్‌ 15, జనంసాక్షి):

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సాధరణ ఎన్నికలకు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయన తనదైన శైలీలో అధాకార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలపై యాక్షన్‌ ప్లాన్‌కు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్‌, టిదిపి ప్రజా ప్రతినిధులపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తూనే టిడిపి, కాంగ్రెస్‌ క్రిస్టియన్‌ ఆరోపణలకు మజ్లిస్‌తో కౌంటర్‌ ఎటాక్‌ చేశారని అంటున్నారు….. సాధరణ ఎన్నికలకు మరో సంవత్సరంన్నర మాత్రమే ఉంది. దీంతో జగన్‌ తన వ్యూహనికి మరింత పదును పెట్టినట్లుగా కనిపిస్తోంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురి చేసేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. సాధరణ ఎన్నికల వరకు ఆగకుండా ముందస్తు ఎన్నికలు వస్తేనే మంచిదనే భావనతో జగన్‌ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.అందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.

తాజావార్తలు