జగ్గారెడ్డి సీమాంధ్ర తొత్తు : కోదండరాం

హైదరాబాద్‌: మొదటి నుంచి అనుమానించినట్టే జరిగింది. జగ్గారెడ్డి సీమాంధ్ర తొత్తు అని తేలిపోయింది’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. జగ్గారెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనపుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగే అర్హత జగ్గారెడ్డికి లేదని కోదండరాం ధ్వజమెత్తారు.