జపాన్‌ నూతన ప్రధానిగా షింజో అబే

టోక్యో: జపాన్‌ నూతన ప్రధానిగా  షింజో అనే బాధ్యతలు చేపట్టనున్నారు. జపాన్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఎల్‌డీపీ ఘన విజయాన్ని సాధించింది. గత ఎన్నిరల్లో పరాజయాన్ని చవిచూసిన ఎల్‌డీపీ ఈ ఎన్నికల్లో 294 సీట్లను గెలుచుకుంది. ప్రత్యర్థి పార్టీ డీజీపీ దిగువ సభలో 57 సీట్లను మాత్రమే గెలుచుకుంది. జపాన్‌ నూతన సారధిగా ఎన్నికైనా షింజోకు ఆమెరికా అధ్యక్షుడు ఒబామా శుభాకాంక్షలు తెలియజేశారు.