జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి):
జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును దొంగలించుకొని పోయారు.ఇంటి యాజయాని తిరుపతి యాత్రకు వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు తాళాలు పగలకొట్టి ఇంట్లో ప్రవేశించి బీరువా పగలకొట్టి బంగారు ఆభరణాలను దొంగలించుకొనిపోయారు. ఈ మేరకు జమ్మికుంట పోలీసులు క్లూస్‌ టీమ్‌,వేలిముద్రల నిపుణులను రప్పించి నమూనాలను సేకరించారు.టౌన్‌ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.