జయ హో రహీమున్నీసా

తెలంగాణ లో విజయమ్మ అడుగు పెడితే ఖబడ్దార్‌ అని తెలంగాణ బిడ్డలు ఒక్కసారిగా కలబడ్డరు. వందల కొద్ది కార్య కర్తలరి ముందస్తు అర్రేస్తులు చేసిన ,బడా బడా నాయకులు నోరు విప్పకున్న కాంగ్రెస్‌ వారు తోక ముడిచిన కూడా తెలంగాణ జంక లేదు, మా జాగల శత్రువులకు అడుగుపెట్టే అవకాశం లేదు ఊకుమ్మడిగా చెప్పిందిద. పోలిసుల వాళ్ళ విజయమ్మని కంటికి రెప్పలా కాపాడడం కోసం ఆడపిల్ల అనికూడా చూడకుండా విచక్షణా రహితంగా, అతి నీచంగా.పాశవికంగా చితక బాదినరు. అయినా జై తెలంగాణని ఆపలేదు ఆ అడ బిడ్డ , అడ పులి జీప్‌ ఎక్కి తన కాలి చెప్పుతో విజయమ్మకి నిరసన తెలపడం మూములు ముచ్చట కాదు.ఆమె పేరు రహీమన్నిసా , వరంగల్‌ బిడ్డ , సిరిసిల్లకి
వచ్చి విజయమ్మని సవాల్‌ చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఆడవాళ్ళు లేరు, మైనారిటీలు లేరు అన్న వాళ్లకి కూడా పెద్ద చెప్పు దెబ్బ. ఇప్పుడు ఎక్కడ చూసినా రహీమున్నీసా పేరే . ఇంటర్నెట్‌లో , ఫేస్‌ బుక్‌ లో , యి ట్యూబ్‌ రహీమున్నిసా ఫోటోలు వీడియాలు. తెలంగాణ లాటీల దెబ్బలు తిన్న బిడ్డలెందరొ , వందల కొద్ది కేసుల ఉన్నా , జైళ్ళలో ఉండి, బయటకొచ్చి బెయిల్‌ కోసం తిరుగుతూ కూడా తెలంగాణ భుజాలమీద మోస్తున్నారు.
తెలంగాణ వొస్తే మల్లా రెడ్ల రాజ్యమోస్తాది కదా అని బిడ్డ అని పెద్ద మనుషుల అంటుంటరు ఊర్లల్ల . రెడ్ల రాజ్యం ఏమో కాని జగన్‌ రెడ్డిని తెలంగాణలో గెలిపించే దాక కొంత మంది రెడ్లు నిద్ర పొయేటట్టు లేరు. మొన్న పరకాల ఎన్నికలలో ఏశక్తులు పని చేసినయో ఇప్పటి విజయమ్మకి రాకకి , దీక్షకి అదే రెడ్లు వెన్నెంటి కొమ్ము కాస్తున్నయని క్షేత్ర స్తాయి కార్యకర్తలు మొత్తుకుంటున్నరు. నిజమే ఇక్కడ కులాల ప్రస్తావన అనవసరం అనుకున్నా , అదే కులం ఇక్కడ ఖచ్చితంగా పని చేసింది. కే.కే. మహేందర్‌ రెడ్డి రూపంలో . జగన్‌ రెడ్డి ని జైళ్ళలో పెట్టినట్టే పెట్టి , వాళ్ల తల్లి గారికి అత్యంత పోలిసు బలగాలని కోసం బిడ్డలు రక్తాలని కళ్ళ చూడాడానికి కూడా సిద్ద పడ్డరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ,వారు కూడా తెలంగాణ వారే ,అప్పుడే చెన్నా రెడ్డి పుణ్యం కట్టుకుంటే ఇపుడే ఇక్కడి నయా చెన్నా రెడ్డి లు మళ్ళి తెలంగాణని మెసం చెయ్యి చూస్తున్నారు.
చంద్రబాబు వస్తడు పర్యటనకి,ఆయన సోంత గూండాలు .పోలిసు వేషాలు వేసుకున్న గూండాలు తెలంగాణ వాదులమీద పడి అడ్డగోలు అరాచకాలు చేస్తరు, ఇటు విజయమ్మది అదే కథ , తమ సొంత రాయలసీమ గూండాలు తెచ్చుకుని దీక్షని చేద్దామనుకున్నది కాని రహీమున్నిసా చెప్పుధాటికి తట్టుకోలేక పోయింది. మొన్న ఈటెల రాజందరే డ్రైవర్‌ మల్లేశం తెలంగాణ ద్రోహి జయప్రకాశ్‌ నారాయణ కి తెలంగాణ రుచి చూపించిండు, ఇపుడు రహీమున్నిసా , ఆమె చూపించిన చెప్పు అమెరికా ప్రెసిడెంట్‌ జార్జ్‌బుష్‌ అల్‌ జైది విసేరిసిన చెప్పంత శక్తి వంత మైంది. రాయలసీమ నుండి వచ్చిన రౌడిలు , ఇక్కడి పోలిసుల చెప్పులకి , చీపుర్లకి , రాళ్ళకి భయపడతరు, అవి నాటబాంబులకంటే భయంకర మైనవి .జై తెలంగాణ అన్న ఒక్కొక్క నినాదం ఒక్కొక్క ఆత్మగౌరవ తూటాల వంటివి .ఏ దొంగ నాయకులకి కూడా నిద్ర పట్టకుండా చేస్తది. రహీమున్నిసా ఒక తెలంగాణ పౌరుషం , మా పాలన మాకు కావాలి అన్న తెలంగాణకు ఒక ప్రతీక . ఒకగాయం . ఇవ్వాళ ఆసుపత్రి లొ గాయలతోని విరిగిన బొక్కలతోనే పొట్లాడుతున్నది. ఆడపిల్లని గౌరవంగా చూసే సంస్కతీ మనకింకా అబ్బలేదుకాని , ఈ తెలంగాణ పోరులో ప్రతి బిడ్డను అందరూ దగ్గరకు తీసుకుంటున్నరు, అదే గొప్ప విషయం , అదే తెలంగాణ విజయం.
విజయమ్మని తెలంగాణ లోకి తీసుకొచ్చి చెప్పుదెబ్బలు తినిపించిన నాయకులందరికీ జోహార్లు ఎందుకుంటే మల్లోకి సారి మాలో తెలంగాణ ని రగిలినిచ్చినందుకు . మీ ప్రతి కుట్ర కి మాలో ఎవరో ఒకరు బలి కావలసిందే. ఇన్ని బలులు
తీసుకుని మీరు బాగు పదే డి ఏముంది, లక్షల కొట్లుతిని పెట్టలేరు అని తెలంగాణ తేల్చేసింది. ప్రజలు ఇంకా బలంగాబ ఉన్నారు అందానికి ఇదోక పెద్ద ఉదాహరణ . రేపు జరుగ బోయే హైదరాబాద్‌ మార్చ్‌లో కూడా ఇదే ఉత్సాహం ఉంటది. పోలిసులు ఇప్పటినుంచే రెచ్చిపొతారు అని తెలుసు అయినా వెనక్కి పోయేది లేదు. 2014 వరకు ఈ కపట నాటకాలు జరుగుతూనే ఉంటాయి , మేము పొట్లాడుతూనే ఉంటాము,రాయల తెలంగాణ అని , జగన్‌ తెలంగాణ అని,హైదరాబాద్‌ మాదే అని దీక్షలు ,దినాలు , తద్దినాలు అని నాయకులు పథకాలు వేస్తూనే ఉంటారు, చెప్పు దెబ్బలు తిన్టనే ఉంటారు. తెలంగాణకు ద్రోహం తలపెడితే తరిమి తరిమి కొట్టుడే.. దంచుడే అని చెప్పినా రహీమున్నిసా సాకి మనమందరం అండగా ఉందాం! ఒకసారి పలకరిద్దాం !
సుజాత సూరేపల్లి