జలదృశ్యంలో లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌ పక్కన ఉన్న జలదృశ్యంలో అధికారులు ఏర్పాట్లుపూర్తి చేశారు. అయితే అంతకుముందు అంత్యక్రియలు ఎక్కడనిర్వహించాలనే దానిపై సీఎం పలువురు నేతలతో భేటీ అయ్యారు. జలదృశ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.