జలపాతంలో పడి టెక్కీ మృతి

share on facebook

ములుగు,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : విహారం వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను వీక్షించాలని వెళ్లిన అతడిని నీళ్ల రూపంలో మృత్యువు వెంటాడిరది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల వాటర్‌ ఫాల్స్‌ వద్దగల ధూషాపాటి లొద్ది జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌ పెంట (23) అనే సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు.
కొంగాల గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం వద్దకు ఎవరు వెళ్లకూడదని స్థానికులు చెప్పినా వినకుండా రాహుల్‌ అతడి స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు నీళ్లలోకి దిగాడు.
ప్రమాదవశత్తు రాహుల్‌ నీటిలో మునిగి మృతి చెందాడు. జాలరుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

Other News

Comments are closed.