జలవిహార్‌లో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశం

హైదరాబాద్‌: నగరంలోని జలవిహార్‌లో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రేపు జరగబోయే మార్చ్‌ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, గాయకుడు రసమయి బాలకిషన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు పాల్లొన్నారు.