జలవిహార్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణవాదులు యత్నిస్తున్నారు. తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఐమాక్స్ వద్ద తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.



