ఆత్మకూర్(ఎం) జనవరి 24 (జనంసాక్షి) మండల కేంద్రంలోని 5,6 వ అంగన్వాడి కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి స్వీట్లు బిస్కెట్లు పెన్సిళ్లు ఎరేజర్స్ అందజేశారు వారు మాట్లాడుతూ ఇంటికి దీపం ఆడపిల్లనే అని బాల్య దశ నుండే బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ వాణి జానకి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు