జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటికల పోటీలు

మిర్యాలగూడ,జనం సాక్షి జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటకాల్లో పాల్గొనే జాతీయ స్థాయి నాటక సమాజాలు, నటీనటులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం గౌరవ అధ్యక్షులు తడకమళ్ల రాంచందర్ రావు, అధ్యక్షుడు బోయినపల్లి భుజంగరావు,‌ ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి లు తెలిపారు. గురువారం మిర్యాలగూడ వరసిద్ధి వినాయక ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 2023లో జరగనున్న నాటకోత్సవాలకు పద్య నాటికకు 2,000 రూపాయలు, సామాజిక నాటికకు 1,000 రూపాయలు ఎంట్రీ ఫీజు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ పేరిట డిడి తీసి పంపాలని కోరారు. ప్రదర్శనకు ఎంపికైన పద్యం నాటికకు రూ.40,000, సాంఘిక నాటికకు రూ.20,000 నగదు చెల్లిస్తామని తెలిపారు. పోటీలలో గెలుపొందిన ప్రధమ పద్య నాటికకు ప్రధమ బహుమతి రూ.40,000, ద్వితీయ రూ.30,000, తృతీయ రూ.20,000లతో, పద్య నాటికకు ప్రధమ బహుమతి రూ.20,000, రూ.15,000, రూ.10,000లతో పాటు షీల్డ్ కూడ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాటకాల్లో పాల్గొన్న నటీ, నటులు కళాకారులకు కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. నాటకోత్సవాలు రాష్ట్ర సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి.రామావతారం, సభ్యులు బాపనయ్య, ఉపేంద్ర లు పాల్గొన్నారు.