జీవ వైవిధ్యంపై అవగహాన ర్యాలీ

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, భూపరిపాలన శాఖ కమిషనర్‌ శ్యాముల్‌ తదితరులు హాజరయ్యారు. జీవ వైవిధ్య సదస్సు హైదరాబాద్‌లో జరగడం గర్వకారణమని కృష్ణబాబు పేర్కొన్నారు. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సదస్సుకు 193 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలియజేశారు.