జీహెచ్‌ఎంసీ కార్మికులకు న్యాయం చేయకపోతే మా తడాఖ చూపిస్తాం: కేసీఆర్
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికులకు న్యాయం చేయకపోతే తమ తడాఖ ఏందో చూపిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రమాదాలు జరిగితే జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ దమాక్ లేని పనులు చేసుడు బంద్ పెట్టాలని డిమాండ్ వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే మంత్రుల నివాసాల ముందు చెత్త అలాగే ఉంచాలని సూచించారు. జీహెచ్‌ఎంపీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో టీఆర్‌ఎస్ కొట్లాడుతదని స్పష్టం చేశారు. కార్మికుల ఆరోగ్యం సీఎంకు పట్టదా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.



