జూబ్లీహాలులో టీఎన్‌ఎస్‌ ఆధ్యర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: జూబ్లీహాలులో తెలంగాణ నగరా సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సమైక్యాంధ్రలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం, ఉద్యోగులపై కొనసాగుతున్న  వివక్షపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత,ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, విద్యావేత్త చుక్కారామయ్య, గాయకుడు రసమయి బాలకిషన్‌ హాజరయ్యారు.