జైపూర్‌ సదస్సులో వీహెచ్‌ జై తెలంగాణ

జైపూర్‌ : జైపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌లో రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు దశాబ్దా లుగా ప్రజలు శాంతియుత ఉద్య మాలు చేస్తున్నారని తెలి పారు. ఇప్పటి వరకు వెయ్యి మంది కిపైగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోరికను తెలిపేందుకే ఆత్మ బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. పది జిల్లాల ప్రజలు ఒకే గొంతుతో తెలంగాణ కావాలని కోరుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇకనైనా ప్రజల ఆకాంక్షలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు కుట్రలకు పాల్పడకుండా తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.