జైళ్ల శాఖ డీజీకి యనమల లేఖ
హైదరాబాద్: జైళ్ల శాఖ డీజీకి తెదేపా నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. జైలు అధికారుల సెల్ఫోన్లతోనే జగన్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. జైలు అధికారుల సెల్ఫోన్ వివరాలను బహిర్గతపరించి విచారణ జరిపించాలని యనమల తన లేఖలో డిమాండ్ వ్యక్తం చేశారు.



