టియుడబ్ల్యుజె 143 యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
తాండూరు అగస్టు 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రంఅంబేద్కర్ చౌక్ కూడలిలో
టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు.సుప్రీంకోర్టులో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీ మరియు నిర్మాణాల నిమిత్తం క్లియరెన్స్ రావడంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చంద్రశేఖర్ రావుకు టియుడబ్ల్యు జె 143 యూనియన్ తరపున కృతజ్ఞత సభలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రెస్ ఆకడమి
చైర్మన్ అల్లంనారయణకు ప్రత్యేక కృతజ్ఞతలతో
దన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 143 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కే ప్రభాకర్, తాండూర్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ కుమార్, వెంకటయ్య ,యునియన్ సభ్యులు తదితరులు ఉన్నారు.