టీఆర్‌ఎస్‌ అర్బన్‌ ఇన్‌చార్జ్‌గా లక్ష్మీనరసయ్య

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 : నిజామాబాద్‌ అర్బన్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తనకు అప్పగించిన  కేసిఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయనని పార్టీలో చేరిన లక్ష్మీనరసయ్య వెల్లడించారు. మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమమే లక్ష్యంగా ఉద్యమించిన కేసిఆర్‌ గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో తాను విశేష కృషిచేస్తానని ఆయన అన్నారు. బుధవారం నుంచి నగరంలో ఇంటింటికి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేస్తానని లక్ష్మీనరసయ్య అన్నారు. సోమవారం జరిగిన బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు పోసెట్టి, విద్యార్థి విభాగ నాయకుడు సుజీత్‌ సింగ్‌ ఠాగూర్‌, సత్యప్రకాష్‌, కాకతీయ రాజు తదితరులు పాల్గొన్నారు.