టీడీపీ ట్రస్టు భవన్ ఘనంగా ఆవిర్బావ దినోత్సవ వేడులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతకాన్ని ఆవిష్కరించి వేడులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టీడీపీ పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నందమూరి తారక రామరావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని పెద్దిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.


