టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ

share on facebook
మణుగూరు,ఆగస్టు 21 (జనం సాక్షి):
దేశానికి వెలుగులు విరజిమ్ముతున్న సింగరేణి కార్మికుడికి అందించే కాంపెన్సేషన్ ఆశాస్ట్రీయంగా ఉందని జె. బి. సి. సి. ఐ సమావేశాల్లో పాల్గొనే  సంఘాలు మెరుగైన ఆర్థిక ప్రయోజన ఒప్పందం చేసి కార్మికులకు అండగా నిలవాలనీ శనివారం జరిగిన సంతాప సభలో టిబిజికేయస్ మాజీ అధ్యక్షులు కేంగర్ల. మల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఓసి 2 నందు నాలుగు రోజుల క్రితం జరిగిన  ప్రమాదంలో  అజ్మీరా బాష్యా, పర్స సాగర్, కాంట్రాక్టు కార్మికుడు వేల్పుల వెంకన్న మృత్యువాత పడడం అత్యంత భాధకారమైన విషయమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘము విచారం, బాధను వ్యక్త పరుస్తుందని టిబిజికేయస్ మాజీ అధ్యక్షులు కేంగర్ల. మల్లయ్య తెలిపారు.మృతుల పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మణుగూరు లో
1985 నందు ప్రారంభమైన ఓసి 2 మైన్ నాటి నుంచి నేటి వరకు ఇంత భయంకరమైన ప్రమాదం జరగలేదని ముగ్గురు మృత్యువాత పడటం ఇదే తొలిసారి అని  యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్ల నే ప్రమాదం జరిగిందన్నారు.. ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి భాధ్యత వహించాలని ఆయన తెలిపారు ఉత్పత్తి, ఉత్పాదకత పై  యాజమాన్యం కు ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో లేదన్నారు. యాజమాన్యం కు ఉత్పత్తి, ఉత్పాదకత పై ఉన్న అత్యుత్సాహం వల్లనే మూడు నిండు ప్రాణాలు బలై వారి కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడం జరిగిందని ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు నష్ట పరిహారం రూపాల్లో అందించిన వ్యక్తి లేని లోటు తీర్చడం సాధ్యం కాదని అన్నారు..క్వారీలో రోడ్లు సరిగా లేవని వాటిని మెరుగు పరచకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని గుర్తింపు కార్మిక సంఘము గా స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు అధికారులకు తెలుపడమే కాక స్ట్రక్చర్ సమావేశాల్లో తెలిపినప్పటికి వాటిపై దృష్టి సారించడం లేదంటే యాజమాన్యం కు రక్షణ పై కార్మికుల ప్రాణాల పై ఎంత బాధ్యత ఉందొ తెలిసిపోతుందని తెలిపారు. సింగరేణి నందు ప్రమాదాల పరంపర కొనసాగుతుందని రక్షణ విషయంలో యాజమాన్యం తో  సంప్రదింపులు జరిపిన దున్నపోతు పై నీళ్లు పోసినట్టే అవుతుంది తప్ప యాజమాన్యం లో చలనం లేదని రక్షణ ను మెరుగుపరిచే విషయంలో యాజమాన్యం మెడలువంచే విదంగా టిబిజికేయస్ పని చేస్తోందని తెలిపారు. ప్రాణాలు ఫణంగా పెట్టి దేశానికి వెలుగులు పంచుతున్న కార్మికుడు దురదృష్టవశాత్తు  మైన్ యాక్సిడెంట్ నందు చనిపోతే కార్మికుడి కుటుంబానికి అందించే కాంపెన్సేషన్ లెక్కించే విధానం ఆశాస్ట్రీయం గా ఉందని జె బి.సి సి ఐ ఒప్పందాలలో సవరణ చేసి కార్మికులకు మెరుగైన ఆర్ధిక ప్రయోజనం అందించే విదంగా జె బి సి సి ఐ కార్మిక సంఘాలు కృషి చేయాలని సూచించారు. టిబిజికేయస్ కృషి ఫలితంగా సాధించిన 20 లక్షల  మ్యాచింగ్ గ్రాంట్ తో చనిపోయిన కార్మిక కుటుంబానికి కొంత ఆసరాగా నిలవడం జరిగిందన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు టిబిజికేయస్ చివరి వరకు అండగా నిలుస్తుందని తెలిపారు.చనిపోయిన బాష్యా కుటుంబం లో వారి కుమారుడికి సూటబుల్ జాబ్ మణుగూరు ఏరియా నందునే ఇచ్చే విదంగా యాజమాన్యం తో మాట్లాడటం జరిగిందని మరొక మృతుడు సాగర్ అవివాహితుడు కావడం వల్ల వారి సోదరీమణికి ఉద్యోగ అవకాశం కల్పించమని డైరెక్టర్ (పా)గారిని కోరిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించారని తెలిపారు. మృతుల్లో మరొక కాంట్రాక్టు కార్మికుడికి కూడా మెరుగైన ఆర్థిక ప్రయోజనం కల్పించి వారి కుటుంబానికి టిబిజికేయస్ అండగా నిలుస్తుందని తెలిపారు  సోమవారం నాడు యాజమాన్యం తో  చర్చలు నిర్వహించడం జరుగుతుందని కాంట్రాక్టు కార్మికుకు దురదృష్టవశాత్తు  మైన్ ప్రమాదం లో  మరణించితే సింగరేణి యాజమాన్యం కాంపెన్సేషన్ అందించే విదంగా మాట్లాడటం జరుగుతుందని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఒప్పందం చేస్తామని ఆయన తెలిపారు చనిపోయిన కార్మికుల ఆత్మ శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం ఆయన ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు..తర్వాత మృతుల కుటుంబాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి రోధిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి టిబిజికేయస్ అండగా నిలుస్తుందని అభయం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు, లెవెన్ మెన్ కమిటి సభ్యులు సామ శ్రీనివాస రెడ్డి, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, బ్రాంచి నాయకులు వీర భద్రయ్య, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి,బుర్ర వెంకటేశ్వర్లు, ఫిట్ సెక్రటరీ అశోక్, బుద్ధ వెంకటేశ్వర్లు,కెపియుజి ఫిట్ సెక్రటరీ నాగేల్లి, నాయకులు కెవి రమణ, కె. ప్రభాకర్, మల్లికార్జున్, భద్రయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.