టెట్‌, డీఎస్సీలకు ఒకే పరీక్ష : మంత్రి పార్థసారధి

శ్రీకాళహస్తి : ఉపాధ్యాయ అర్హతలకు సంబంధించి ఇప్పటివరకు డీఎస్సీ, టెట్‌లకు వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇకపై రెండూ కలిపి ఒకే పరీక్షగా నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం శనివారం ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో రూ. 4500 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదించామని ఆ పనులు మరో 15 రోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. దర్శనానంతరం తిరిగి వెళ్లే సమయంలో స్థానిక రామసేతు వంతెనకు సమీపంలో వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించి మంత్రిని ఘెరావ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు.