టోక్యో ఒలింపిక్స్‌కు మేము రాము

share on facebook

తేల్చి చెప్పేసిన ఆస్టేల్రియా
అథ్లెట్స్‌ ఆరోగ్యం ముఖ్యమని వెల్ల‌డి
సిడ్నీ,మార్చి23(జనం సాక్షి ): ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం జూలైలో జరగాల్సిన ఉన్న టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా తప్పేలా కనబడుటం లేదు. ఈ మెగా ఈవెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్‌ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తాము ఒలింపిక్స్‌కు రావడం లేదని కెనడా తేల్చిచెప్పగా,
ఇప్పుడు ఆ జాబితాలో ఆస్టేల్రియా కూడా చేరిపోయింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఒక మేజర్‌ ఈవెంటైన ఒలింపిక్స్‌ను నిర్వహించడం అనేది సాధ్యం కాదని అభిప్రాయపడిరది. ఆ విషయం చాలా స్పష్టంగా కనబడుతోందని పేర్కొంది. అదే సమయంలో ఒలింపిక్స్‌ నిర్వహించినా తాము మాత్రం దానికి దూరంగా ఉంటామని స్పష్టం చేసింది. దీనిపై సోమవారం ఆస్టేల్రియా ఒలింపిక్‌ కమిటీ(ఏఓసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో జూలైలో నిర్వహించడానికి సిద్ధమైతే మాత్రం అఅథ్లెట్స్‌ ప్రాణాతో చెగాటమాడటమేనని పేర్కొంది. దీనిపై ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక దేశం జపాన్‌ ఆలోచనలో పడగా, ఆస్టేల్రియా తమ నిర్ణయాన్ని చెప్పేసింది. మాకు మా అథ్లెట్ల ఆరోగ్యం, వారి కుటంబా ఆరోగ్యాలే ముఖ్యం. మా ఒలింపిక్స్‌ ప్రణాళికల్ని రద్దు చేసుకుంటున్నాం. ప్రపంచ వాప్తంగా కరోనా వైరస్‌ ప్రబడంతో జూలై నాటికి పరిస్థితు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం అనేది చాలా కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది నిర్వహించడమే ఉత్తమం. 2021 సమ్మర్‌లో ఒలింపిక్స్‌ జరపడమే ఉత్తమం’ అని ఏఓసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్‌ కరోల్‌ పేర్కొన్నారు.

Other News

Comments are closed.