ట్రక్కు బోల్తా : ఐదుగురు కూలీల మృతి
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్‌గన్ జిల్లా జుమ్రిఘాట్ వద్ద ఒక ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడడంతో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు చత్తీస్‌గడ్ వాసులుగా గుర్తించారు.



