ట్విట్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నెంబర్ వన

 

20వేల 200 మంది ఫాలోవర్స్

రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 8. (జనం సాక్షి)..ట్విట్టర్ లోరాజన్న సిరిసిల్ల కలెక్టర్ నెం.మొదటి స్థానం లో నిలిచారు. 2022 మొదటి వారం చివరలో సేకరించిన గణాంకాల ప్రకారం ట్విట్టర్‌ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక ట్విట్టర్ తెలంగాణ లోనే మొదటి స్థానంలో నిలిచింది.

ఫాలోవర్స్‌పరంగా ప్రస్తుత యేడాది త్రైమాసికం చివరలో 20K (ఇరవై వేలు) మైలు రాయిని దాటిన కలెక్టర్ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ప్రస్తుతం 20 వేల 200 మంది అనుసరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5.4 లక్షల జనాభాకుగాను ప్రతి వెయ్యి మందిలో 37 మంది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్నారు.సంఖ్య పరంగా చూసుకుంటే అత్యధిక మంది అనుసరించే ట్విట్టర్ ఖాతాల జాబితా లో వైశాల్యం, జనాభా పరంగా చిన్న జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల రెండో స్థానంలో ఉండడం గమనార్హం. 2011 భారత గణాంకాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా జనాభా కేవలం 5 లక్షల 46 వేలు కాగా, ఇదే ఈ కేటగిరిలో 22 వేల మంది అనుచరులతో ప్రథమ స్థానంలో ఉన్న కరీంనగర్ జనాభా 2011 భారత గణాంకాల ప్రకారం కరీంనగర్ జిల్లా జనాభా 10 లక్షల 5 వేలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తో పోల్చుకుంటే దాదాపు రెండింతలు కావడం విశేషం.
ఖాతాను ప్రారంభించినప్పటి నుంచి ట్విట్టర్ ను క్రియాశీలకంగా నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు,మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర వీఐపీ ల పర్యటనల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం, ప్రజా ఫిర్యాదుల త్వరితగతిన స్పందిస్తుండడం తో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొదటి నుంచి ప్రథమ స్థానంలో ఉంటూ వస్తున్న కలెక్టర్ ట్విట్టర్ ఖాతా తాజాగా 20 వేల మైలు రాయిని చేరుకుంది.