ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌ మికీ ఆర్థన్‌ ఈ రోజు తన ట్విట్టర్‌ అకౌంట్‌నే మూసేశారు. భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో ఘోరపరాజయం చవిచూడడంతో ఆ జట్టు అభిమానులు మికీని ట్విట్టర్‌ కామెంట్లతో వేధించి వదిలిపెట్టారు. దాంతో ఆయన అకౌంట్‌ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దానకి కూడా ఒక అభిమాని సంతోసం వ్యక్తం చేస్తూ ‘అకౌంట్‌ మూసేస్తే పర్వాలేదు, ఇప్పటికైనా క్రికెట్‌ మీద పూర్తిగా దృష్టిపెట్టవచ్చు… అని వాఖ్యానించాడు.