డిజిపి రేసులో ఉన్నానన్న తేజ్‌దీప్‌ కౌర్‌

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ డీజీపీ నియాపకంపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని తేజ్‌దీప్‌ కౌర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానూ డిజిపి రేసులో ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆమె విూడియాతో మాట్లాడుతూ… తాను డీజీపీ బరిలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంచార్జ్‌ డీజీపీని నియమిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీ కోసం తుది జాబితా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే అని అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ పదవీ కాలం నవంబర్‌ 11తో ముగినున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డిని ప్రభుత్వం ఇంచార్జ్‌ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్‌దీప్‌ కౌర్‌ వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణకు చెందిన వాడు కావడంతో మహేందర్‌ రెడ్డిన పూర్తికాలం డిజిపిగా కొనసాగించే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి.

తాజావార్తలు