‘డిసెంబర్‌ 9లోపు తెలంగాణపై తేల్చాలి’

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ అంశంపై డిసెంబర్‌ 9లోపు తేల్చాలని కాంగ్రెస్‌ నేత , మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత కలిసి వచ్చే మంత్రులు ఎమ్మెల్యేలతో భవిష్యత్తు కార్యాచరణను కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.