డీఎంకే సమావేశానికి అళగిరి గైర్హాజరు

చెన్నై : డీఎంకేలో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేళపెట్టే అంశంపై చర్చించడానికి పార్టీ కార్యవర్గం ఈ ఉదయం భేటి అయింది. అయితే ఈ సమావేశానికి సీనియర్‌ నేత అళగిరి గైర్హాజరయ్యారు. పార్టీలో స్టాలిన్‌ వ్యవహార శైలిపై అళగిరి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గత వారం యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్న అనంతరం పార్టీ నేతలతో కాకుండా విడిగా వెళ్లి అళగిరి ప్రధానకి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.

తాజావార్తలు