ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యూ, డీజీపీ దీనేష్‌రెడ్డిలు గురువారం హుటాహుటాటీనా ఢిల్లీ పయనమయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన పిలుపు మేరకు వీరిద్దరూ అత్యవసరంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్ర నగరంలో రాష్ట్రపతి పర్యటన ఉన్నప్పటికీ వీరు ఇరువురు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 28లోపు ప్రత్యేక తెలంగాణ అంశంపై స్పష్టత ఇస్తామని కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఢిల్లీకి పిలవడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.