ఢిల్లీలో జేడీయూ భారీ బల ప్రదర్శన

న్యూఢిల్లీ : బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దేశరాజధనిలో జేడీయూ చేపట్టిన భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ రాంలీలా మైదానంలో చేపట్టిన ఈ ర్యాలీకి భారీగా జేడీయూ కార్యకర్తలు తరలిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తోపాటు ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొననున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంమ్రోడీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ ఢిల్లీలో ఈ ర్యాలీ ద్వారా బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.