ఢిల్లీ గడ్డమీద కూడా ‘టీ’పై వివక్ష: ఆమోస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఢిల్లీ గడ్డ మీద కూడా తెలంగాణపై వివక్ష కనబడుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ కోసం ప్రధాని ఎంపీ కావూరికి ఫోన్ చేయడంపై ఆమోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఎంపీలను ప్రధాని చిన్న చూపు చూశారన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లు అవసరం లేదా అని ప్రశినంచారు. సీమాంధ్ర ఎంపీలకు హైకమాండ్‌తో ఉన్న సానిహిత్యం తెలంగాణ ఎంపీలకు ఉండదనేది ఈ రోజుతో రుజువైందని పేర్కొన్నారు.



