ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఎదుట కేజ్రీవాల్‌ ధర్నా

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ధర్నాకు దిగారు. దక్షిణ ఢిల్లీలో నివాసాల కూల్చివేతలకు వ్యతిరేకంగా వంద మంది బాధితులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీలోని 16 వందల కాలనీల్లో నివాసాలను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళనతో ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.