తమిళనాడులో రోడ్డుప్రమాదం .. ఐదుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని కనతూర్‌ వద్ద ఈ ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈస్ట్‌ కోస్ట్‌ రహదారిపై కారు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరునాళ్లర్‌ ఆలయాన్ని దర్శించుకొని కారులో వస్తున్న ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతుల్లో ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కనతూర్‌ పోలీసులు మృతదేహాలను రోయపెట్టా ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.