తమ్మిలేరు వంతెనపై రాకపోకలు ప్రారంభం

విజయవాడ,నవంబర్‌21: నీలం తుపాను ధాటికి దెబ్బతిన్న కృష్ణా జిల్లాలోని తమ్మిలేరు వంతెనకు అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు. భారీ వర్షౄలు వరదలకు దెబ్బతినడంతో దీన్ని మూసివేశసి మరమ్మత్తులు చేపట్టారు. దీంతో బుధవరాం  నుంచి వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలతో చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు వంతెన వద్ద గండి పడింది. దీంతో రాకపోకలను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. వరద ఉద్ధృతి కొనసాగడంతో పనులు ఆలస్యమయ్యాయి. గండిని పూడ్చివేసి రాకపోకలకు అనుమతించారు.

తాజావార్తలు