తలసానికి అంత సీన్ లేదు. : కొప్పుల
హైదరాబాద్: టీడీపి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీఆర్‌ఎస్ విప్ కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి తనపై పోటి చేయాలని తలసాని డిమాండ్‌పై ఆయన గురువారంహైదరాబాద్‌లో స్పందించారు.తలసానితో పోటి చేసే అవసరం కేసీఆర్‌కు లేదని ఆయన పేర్కోన్నారు. 2004లో పద్మారావు చేతిలో పరాజయం పాలైన సంగతి మరిచిపోయావా అంటూ ఆయన ఈ సంధర్భంగా చురక అంటించారు.దమ్ముంటే చంద్రబాబును సిద్దిపేట నుంచి పోటి చేయాలని తలసానికి ఈశ్వర్ సవాల్ విసిరారు.



