తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం

share on facebook

వేణుగోపాల్ నగర్ లో ఘనముగా తల్లిపాలవారోత్సవాలు


ఖమ్మం అర్బన్ : 03-08-2022: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి అంగనవాడి టీచర్స్ పి . పద్మ, యం . భూలక్మి, రహిమసుల్తానా లు అన్నారు . తల్లిపాలు వారోత్సవాలు బల్లేపల్లి సర్కిల్ లోని వేణుగోపాల్ నగర్ 1 మరియు 3 అంగనవాడి కేంద్రం లో పిల్లలు, తల్లులతో ర్యాలీ, అంగన్వాడీ భవనంలో పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ కాన్పు తర్వాత మొదటి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యమైనవి అని , భావి ఆరోగ్యానికి తొలి బీజం వేసేవి ఇవేనని , ఇవి ఒక రకంగా తొలి టీకా లాంటివి అని ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు బిడ్డ రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి వారు పేర్కొన్నారు. ఈ పాలు ఇన్‌‌‌‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయని , ఐదారు రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వాటిలో కొవ్వులు, లాక్టోజ్ బాగా ఉంటాయి అని, అవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి, రెండు వారాల తర్వాత తల్లిపాలలో 90% నీరు 8% పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు.. 2% ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి వారు తెలిపారు. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా మారిపోయే తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదని అన్నారు. డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు మన నినాదం కావాలని.. ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ళ విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారని.. ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉంది. దీనికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం కూడా లేదు. బిడ్డకు తల్లి పాలు పడితే చాలు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమము లో ANM రహీంబీ, ఆశ కార్యకర్త ఈశ్వరమ్మ, గర్భిణీ మహిళలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.