తిమ్మక్కపల్లి చెరువులో గుర్తుతెలియని శవం లభ్యం.
రాయపోల్ సెప్టెంబర్ 9, జనం సాక్షి.
మండల పరిధిలో తిమ్మక్కపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని శవము లభ్యమయింది.గ్రామస్తులు,ఎస్సై మహబూబ్ చెరువు వద్దకు చేరుకొని,చెరువులో పడి ఉన్న శవాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు గ్రామానికి చెందిన యువ నాయకులు ఇప్ప దయాకర్, మాదాస్ వెంకట్ గౌడ్ లు ఇద్దరు శవం దగ్గరకు వెళ్లి తాడు సహాయంతో బయటకు తీశారు. వీరిని గ్రామ ప్రజలు,స్థానిక ఎస్సై అభినందించారు.