తిరుపతి – కరీంనగర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి- కరీంనగర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షినమధ్‌య రైల్వే నిర్ణయించింది. జనవరి 9న రాత్రి 10.40 గంటలకు తిరుపతి నుంచి కరీంనగర్‌కు, జనవరి 10న రాత్రి 7.10 గంటలకు కరీంనగర్ నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలియజేశారు. ఈ రైళ్లు శ్రీకాళహస్తి, విజయవాడ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, పెద్దపల్లిల మీదుగా పయనిస్తాయని వారు స్పష్టం వ్యక్తం చేశారు.