తిరుమల భద్రతపై అద్వానీ ఆందోళన?
తిరుపతి: తిరుమల దేవస్థానం భద్రతపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక శ్వేతాభవన్‌లో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం వాడివేడిగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ముంబయి తరహాదాడులు జరిగితే ఎలా ఎదుర్కొంటారని అద్వానీ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని వెంకయ్యనాయుడు ప్రశ్నించినట్లు తెలిసింది. తిరుమల భద్రత విషయంలో అధికారుల తీరుపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.



