తుంగభద్ర జలశయం నుంచి 3గేట్ల ద్వారా నీటి విడుదల

హొస్సేట: తుంగభద్ర జలాశయం నుంచి ఆదివారం డ్యాంలోని 3గేట్లను అడుగుమేర ఎత్తి 4800 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేశారు. గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీకల్లా గేట్లను ఎత్తివేశారు. ఈ ఏడాది తుంగభద్ర పూర్తిగా నిండటానికి ఓ నెల ఆలస్యమైంది. ఆదివారం ఉదయం 11గంటలకు అర్చకులు జలాశయం యంత్రాలకు విశేషపూజలు నిర్విహించారు. అనంతరం తుంగభద్రమ్మకు వాయనం సమర్పించారు. మండలి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డ్యాం ఇన్‌ఛార్జి వెంకటశివయ్య తదితరులు పాల్గొన్నారు.