తుంగభద్ర నీటి మళ్లింపు

కర్నూలు : తుంగభద్ర దిగువ కాలువ నుంచి కర్ణాటకు చెందిన రైతులు అక్రమంగా నీటిని మళ్లించారు. కర్నూలు జిల్లా తాగునీటి కోసం విడుదల చేసిన నీటిని 59వ కి.మీ వద్ద సిరిగుప్ప శాసనసభ్యుడి ఆధ్వర్యంలో 300మంది రైతులు దారి మళ్లించారు. కర్నూలు జిల్లాకు 850 క్యూసెక్కులు రావలసి ఉండగా 550 క్యూసెక్కులను మళ్లించటంతో నీటిపారుదల శాఖాధికారులు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో మాట్లాడారు. దీనిపై ఆయన బళ్లారి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.