తెరాస అవిశ్వాసానికి మద్దతుగా వైకాపా

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రభుత్వంపై తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుక వైకాపా మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య లెక్కింపు ప్రక్రియను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చేపట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా పలువురి సభ్యులతోపాటు వైకాపా సభ్యులు మద్దతు పలికారు. దీంతో నోటీసుకు 45 మంది సభ్యుల మద్దతు లభించింది.