తెలంగాణకు అడ్డంకి దోపిడీదారులే : పాల్వాయి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోపిడీదారులే అడ్డంకి అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజలెవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదన్నారు. లగడపాటి రాజగోపాల్‌, కావూరి సాంబశివరావును తెలంగాణ ప్రజలు ఎవరైనా కొట్టారా, వారి ఆస్తులను లూటీ చేశారా అని ప్రశ్నించారు. వారు తెలంగానను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. రేపటి సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.