తెలంగాణకు ఎంఐఎం పార్టీకి ముడిపెట్టవద్దు

అసదుద్దిన్‌ ఓవైసీ

హైదరాబాద్‌, జనవరి 10 (జనంసాక్షి):
తెలంగాణ విషయంలో ఎంఐఎంను తప్పుపడితే సహించబో మన్నారు. కేంద్రంతో కొట్లాడి తెలంగాణను సాధించుకోవాలని సూచించారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ నిర్దోషిగా బయట ికొస్తాడని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. గురువారంనాడు నాంపల్లిలోని దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. అక్బరుద్దీన్‌ నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోర్టులపై తమకు విశ్వాసం ఉందన్నారు. అక్బరుద్దీన్‌పై రాజద్రోహం కేసు పెట్టడం విచారకరమన్నారు. అక్బరుద్దీన్‌ దోషా.. నిర్దోషా అన్నది కోర్టులో తేలుస్తాయని చెప్పారు. తమపై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడు తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లీము లు తమ ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.