తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి: ఏరాసు

కొత్తపేట: తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని శిల్పి రాజకుమార్‌ ఒడయార్‌ ఇంటికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విభజన కోసమే తెరాస ఏర్పడిందని మిగిలిన రాజకీయ పార్టీల్లో తెలంగాణ, సమైక్యవాదులు ఉన్నారన్నారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు అంశాన్ని వైఎస్‌ ఉండానే ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు తెలిపారు.