తెలంగాణపై పార్టీల వైఖరి స్పష్టం చేయాలి:కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ పోరాటంలో పాల్గొనే ఏ పార్టీ అయినా తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ రాజకీయా జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. సమైక్యవాద రాజకీయాల కోసం తెలంగాణలో పాదయాత్రలు నిర్వహించే పార్టీలను అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజోలులో సోమవారం సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జాగృతి ఆధ్వర్యంలో జేఏసీ నిర్వహించనున్న బతుకమ్మ జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి రావటంతోనే సరిపుచ్చుకోకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తమ నిరంతర కార్యచరణ కొనసాగించాలన్నారు.



